Wanaparthy: కానాయిపల్లి ఆర్ అండ్ ఆర్ కేంద్రంలో లెవలింగ్ పనులు పూర్తి చేయాలి: కలెక్టర్!

Wanaparthy: కొత్తకోట మండలం కానాయిపల్లి ఆర్ అండ్ ఆర్ కేంద్రంలో లెవలింగ్ పనులను వేగవంతం చేయాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం ఆదేశించారు.

B. KISHORE KUMAR, KOTTHAKOTA
Published on: 27 Nov 2026 4:57 PM IST
Wanaparthy
X

Wanaparthy: కానాయిపల్లి ఆర్ అండ్ ఆర్ కేంద్రంలో లెవలింగ్ పనులు పూర్తి చేయాలి: కలెక్టర్!

వనపర్తి జిల్లా: వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం కొత్తకోట మండల పరిధిలోని కానాయిపల్లి ఆర్ అండ్ ఆర్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ కొనసాగుతున్న లెవలింగ్, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డిసెంబర్ మొదటి వారంలో డ్రా ద్వారా ప్లాట్లను కేటాయించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం అప్పటిలోగా లెవలింగ్ పనులతో పాటు మిగిలిన మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేసి పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ అనుమతి పఅందిన 1,034 మంది లబ్ధిదారులకు డిసెంబర్ మొదటి వారంలో డ్రా ద్వారా ప్లాట్లను కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. మిగతా వారికి కూడా ప్లాట్లు కేటాయించేందుకు ప్రభుత్వానికి నివేదించడం జరిగిందని వాటికి కూడా అనుమతులు రాగానే కేటాయించడం జరుగుతుందని తెలిపారు.

అనంతరం కలెక్టర్ కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోని దండుగడ్డ కాలనీలో నూతనంగా నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించారు. ఉపకేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించి, ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. నూతన ఆరోగ్య ఉపకేంద్రాన్ని వెంటనే వినియోగంలోకి తీసుకువచ్చి, ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఉపకేంద్రంలో వైద్య సేవలను వెంటనే ప్రారంభించాలని సంబంధిత వైద్య అధికారిని ఆదేశించారు.

ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ఆర్డీవో సుబ్రహ్మణ్యం, పంచాయతీరాజ్ శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్, స్థానికులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

B. KISHORE KUMAR, KOTTHAKOTA

B. KISHORE KUMAR, KOTTHAKOTA