Seerole: సీరోలు-ఖమ్మం ప్రధాన రహదారిపై ఈదురుగాలులకు కూలిన చెట్టు!
Seerole: మహబూబాబాద్ జిల్లా సీరోలులో ఈదురుగాలులకు రోడ్డుపై కూలిన చెట్టు. జేసీబీ సహాయంతో తక్షణమే తొలగించి రాకపోకలు పునరుద్ధరించిన యజమాని.
Seerole: సీరోలు-ఖమ్మం ప్రధాన రహదారిపై ఈదురుగాలులకు కూలిన చెట్టు!
Seerole: మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి తోడు వీచిన ఈదురుగాలులతో సీరోలు నుంచి ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిపై చెట్టు కూలిపోయింది. దీంతో రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న జేసీబీ యజమాని వెంటనే స్పందించి జేసీబీ సహాయంతో రోడ్డుపై పడిన చెట్టును తొలగించారు. దీంతో రాకపోకలు సజావుగా సాగాయి. సమయస్ఫూర్తితో స్పందించి చెట్టును తొలగించిన జేసీబీ యజమానిని స్థానికులు అభినందించారు.




