Kalwakurthy: కల్వకుర్తిలో వరి పంట కోతకు అడ్డంకి.. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన

Kalwakurthy: కల్వకుర్తి మండలం కురుమిద్ద శివారులో కోతకొచ్చిన వరి పంటను దాయాదులు కోయనివ్వడం లేదని ఆరోపిస్తూ బాధిత రైతు కుటుంబం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపింది.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 13 Nov 2026 9:31 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: కల్వకుర్తిలో వరి పంట కోతకు అడ్డంకి.. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన

నాగర్ కర్నూల్ జిల్లా: కల్వకుర్తి మండల పరిధిలోని కురుమిద్ద గ్రామ శివారులో తమ వ్యవసాయ పొలంలో రైతు లక్ష్మమ్మ వరి పంట సాగు చేయడం జరిగింది. సాగు చేసిన వరి పంట కోతకు వచ్చిన నేపథ్యంలో పంటను కోసేందుకు లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు వ్యవసాయ పొలం వద్దకు వరి కోత మిషన్ తో వెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది.

అయితే తమ వ్యవసాయ పొలం గుండా వరి కోత మిషన్ రానిచ్చేది లేదని వారికి పంటను కోయనిచ్చేది లేదని దాడి చేసేందుకు ప్రయత్నించడం జరిగిందని బాధ్యత కుటుంబం ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది వరి పంట కోసేందుకు అడ్డుపడుతున్న కుల సంఘం నేత దయాధులను రెచ్చగొడుతూ దాడి చేపించే ప్రయత్నం చేయడం జరుగుతుందని బాధ్యత కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

పోలీసులు రెవిన్యూ అధికారులు సైతం కుల సంఘం నేత దౌద్బలంతో ప్రత్యర్థులకు మాత్రమే సహకరించడం జరుగుతుందని తమ వరి పంట నేల పాలవుతున్న కనికరం చూపించడం లేదని పేర్కొన్నారు.

పోలీసు రెవెన్యూ అధికారులు కుల సంఘం నేతలు దయాతుల వ్యవహార తీరును నిరసిస్తూ కల్వకుర్తిలోని పాలమూరు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఈ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు అనంతరం తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆర్డిఓకు వినతి పత్రం అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY