Devarakadra: ప్రజావాణిలో రైతు ఫిర్యాదు.. రైల్వే నష్టపరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి!
Devarakadra: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటాయపల్లిలో రైల్వే డబుల్ లైన్ కోసం భూమి కోల్పోయిన రైతు వెంకటేష్ నష్టపరిహారం కోసం ప్రజావాణిలో అర్జీ.
Devarakadra: ప్రజావాణిలో రైతు ఫిర్యాదు.. రైల్వే నష్టపరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి!
Devarakadra: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన సాకలి వెంకటేష్‌కు సంబంధించిన సర్వే నెంబర్ 22 లో 5 గుంటల భూమిని రైల్వే డబుల్ లైన్ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే భూమిని స్వాధీనం చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు తనకు నష్టపరిహారం అందలేదని వెంకటేష్ తెలిపారు.
దీంతో సోమవారం దేవరకద్ర మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులను కలిసి తన సమస్యను వివరించారు. తన భూమికి సంబంధించిన నష్టపరిహారాన్ని త్వరితగతిన చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై అధికారులు స్పందించి, నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.




