Veldanda: ఎల్ నినో ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి: బనావత్ అరుణ్
Veldanda: ఎల్ నినో ప్రభావంతో వచ్చే వర్షాభావ పరిస్థితుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉంటూ స్వల్పకాలిక పంటలు, పంట బీమాను ఎంచుకోవాలని బీజేవైఎం నేత అరుణ్ కుమార్ సూచించారు.
Veldanda: ఎల్ నినో ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి: బనావత్ అరుణ్
నాగర్ కర్నూల్ జిల్లా: వెల్దండ మండల పరిధిలోని రైతులు ఎల్ నినో ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకునే మార్పుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆదివారం బీజేవైఎం వెల్దండ మండల అధ్యక్షుడు బనావత్ అరుణ్ కుమార్ సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో పాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని, తక్కువ నీటితో సాగు చేయగల పంటలు, చిరుధాన్యాలు, స్వల్పకాలిక పంటల సాగుపై దృష్టి సారించాలని కోరారు.
పంటలకు బీమా చేయించుకోవడంతో పాటు అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ పంటల సాగులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బనావత్ అరుణ్ కుమార్ రైతులకు విజ్ఞప్తి చేశారు.




