Yerravalli: రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలి: సమన్వయకర్త అర్చన!
Yerravalli: ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గడంతో వరికి బదులు పప్పు దినుసులు, కూరగాయలు సాగు చేయాలని యర్రవల్లి పర్యటనలో కేవీకే సమన్వయకర్త అర్చన సూచించారు.
Yerravalli: రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలి: సమన్వయకర్త అర్చన!
Yerravalli: ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తున్నందున రైతులు వరికి బదులుగా పప్పు దినుసులు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని రైతు విజ్ఞాన కేంద్రం జిల్లా సమన్వయకర్త అర్చన అన్నారు.
గురువారం యర్రవల్లి మండలంలోని తిమ్మాపూర్, బీచుపల్లి, యర్రవల్లి గ్రామాలలో ఆమె క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాభావ పరిస్థితులు, పంటల కీలక దశల్లో నేలలో తేమ అందుబాటులో లేకపోవడం వలన పంటలు ఎండిపోవడం మరియు రైతులు ఎదుర్కొంటున్న పంట నష్టాల గురించి రైతులతో చర్చించారు. రైతుల నుంచి ప్రస్తుత సాగు పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటీక్యాల రైతు ఉత్పత్తిదారుల సంఘం రైతులు, మహిళా రైతులతో సమావేశమై, ఎఫ్ పి ఓలో సభ్యత్వం పొందడం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు.
ముఖ్యంగా సామూహిక మార్కెటింగ్, నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదకాల లభ్యత, సాంకేతిక సలహాలు మరియు మెరుగైన మార్కెట్ అవకాశాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వేరుశనగ పొలంలో నిర్వహించిన రైతు క్షేత్ర పాఠశాల కార్యక్రమంలో కూడా పాల్గొని రైతులతో పంట సాగు విధానాలు, యాజమాన్య పద్ధతులు మరియు పంట అభివృద్ధి దశలపై చర్చించారు.
ఎఫ్ పి ఓ రైతుల వేరుశనగ మరియు వరి పొలాలను సందర్శించారు. వేరుశనగ పంటలో పూత దశలో ఎకరానికి 200 కిలోల జిప్సం మరియు 10 కిలోల యూరియా వేయాలని సూచించారు. వరి పొలాలను పరిశీలించగా నేలలో తేమ కొరవడటంతో పంట పూర్తిగా ఎండిపోయినట్లు గుర్తించారు.




