Wanaparthy: ఘోర ప్రమాదం.. స్కూటీని ఢీకొన్న కారు, ఒకరు మృతి!

Wanaparthy: పెబ్బేరు వద్ద నేషనల్ హైవే 44 పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు స్కూటీని ఢీకొన్న ఘటనలో జూటూరు శ్రీనివాసులు మృతి చెందగా, బాలకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి.

G. BALAVARDHAN, PEBBERU
Published on: 9 Aug 2026 8:32 PM IST
Wanaparthy
X

Wanaparthy: ఘోర ప్రమాదం.. స్కూటీని ఢీకొన్న కారు, ఒకరు మృతి!

వనపర్తి: వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణ శివారులోని బాలాజీ దాబా వద్ద జాతీయ రహదారి 44పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డబుల్ బెడ్రూం కాలనీకి చెందిన జూటూరు శ్రీనివాసులు, బజారు బాలకృష్ణ స్కూటీపై టౌన్‌కు వస్తుండగా.. కడప నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు స్కూటీని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో జూటూరు శ్రీనివాసులు (42) అక్కడికక్కడే మృతి చెందగా.. బాలకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. బాలకృష్ణను తొలుత వనపర్తి ఆసుపత్రికి, అనంతరం పరిస్థితి విషమించడంతో మహబూబ్‌నగర్ మీదుగా హైదరాబాద్ నిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదంపై శ్రీనివాసులు భార్య శశికళ ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ షేక్ దావూద్ ఇబ్రహీంపై కేసు నమోదు చేసినట్లు పెబ్బేరు ఎస్సై వెంకటేష్ గౌడ్ తెలిపారు.

కాగా.. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాసులు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. దహన సంస్కారాల కోసం పెబ్బేరు ఆర్యవైశ్యులు రూ.75 వేల ఆర్థికసాయం అందించగా.. మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ రూ.5 వేలు, మాజీ కౌన్సిలర్ చిన్న ఎల్లారెడ్డి రూ.10 వేల సాయం అందించారు. శ్రీనివాసులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.

G. BALAVARDHAN, PEBBERU

G. BALAVARDHAN, PEBBERU

Next Story