Veldanda: మృతి చెందిన హర్షవర్ధన్ కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్!
Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా కొట్ర గ్రామంలో విషాదం.. మృతి చెందిన హర్షవర్ధన్ కుటుంబాన్ని పరామర్శించి రూ. 15 వేల ఆర్థిక సాయం అందజేసిన సర్పంచ్.
Veldanda: మృతి చెందిన హర్షవర్ధన్ కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్!
Veldanda: వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన హర్షవర్ధన్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈశ్వరమ్మ మనవడు హర్షవర్ధన్ బుధవారం ఉదయం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్, గ్రామపంచాయతీ సిబ్బంది మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఈశ్వరమ్మ కుటుంబాని సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అనంతరం రూ.15 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆపద సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన గ్రామ సర్పంచ్, గ్రామ పంచాయతీ సిబ్బందిని పలువురు అభినందించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ శారద చెన్నయ్య, సీనియర్ నాయకుడు జనగల మల్లయ్య, వార్డు సభ్యులు సత్యం, మల్లేష్, సాయి, యువ నాయకుడు రాజు, డిష్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.




