Urukonda: మృతుడి కుటుంబానికి తలసాని అనిల్ రెడ్డి ఆర్థిక సాయం
Urukonda: నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండలో మరణించిన పోలే బక్కయ్య కుటుంబానికి మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు.
Urukonda: మృతుడి కుటుంబానికి తలసాని అనిల్ రెడ్డి ఆర్థిక సాయం
నాగర్ కర్నూల్ జిల్లా: ఊరుకొండ మండల కేంద్రానికి చెందిన పోలే బక్కయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న జకినాలపల్లి మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు తలసాని అనిల్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి మృతుడి కుటుంబానికి అండగా నిలిచారు. తన తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా రూ.5,000 ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, కష్టకాలంలో వారికి అండగా ఉంటామని నాయకులు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఆరిఫ్, డిప్యూటీ సర్పంచ్ యాదయ్య, వార్డు సభ్యులు అభివర్మ, ఆకుల దయాకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రయ్య, పోలే భాస్కర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.




