Veldanda: వెల్దండలో విద్యుత్ షాక్ బాధితునికి రూ.20 వేల ఆర్థిక సాయం!
Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లిలో విద్యుత్ షాక్ బాధితుడి కుటుంబానికి రూ.20 వేల సాయం అందించిన సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్‌రావు.
Veldanda: వెల్దండలో విద్యుత్ షాక్ బాధితునికి రూ.20 వేల ఆర్థిక సాయం!
Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం విద్యుత్ షాక్‌కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి కుటుంబానికి వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్‌రావు రూ.20 వేల ఆర్థిక సహాయం అందించారు.
వెల్దండ మండలం చెదురుపల్లి గ్రామానికి చెందిన పోలే శ్రీరాములు 15 రోజుల క్రితం విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం కల్వకుర్తిలోని మహిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జూపల్లి భాస్కర్‌రావు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, చికిత్స ఖర్చుల కోసం రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా నిలిచిన భాస్కర్‌రావుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వెల్దండ మాజీ ఎంపీపీ వెంకటయ్య గౌడ్, చెదురుపల్లి సర్పంచ్ ధన్‌సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.




