Gadwal: ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా ఉండాలి: ట్రెజరీ అధికారి గాయత్రి
Gadwal: ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలు, సర్వీసు వ్యవహారాల్లో పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన IFMIS డిజిటల్ విధానాలపై డీడీవోలకు డీటీవో గాయత్రి శిక్షణ ఇచ్చారు.
Gadwal: ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా ఉండాలి: ట్రెజరీ అధికారి గాయత్రి
Gadwal: ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగుల సేవా వ్యవహారాలు, ఖాతాల నిర్వహణలో పారదర్శకత, సమర్థత పెంపొందించేందుకు ప్రవేశపెట్టిన ఐఎఫ్ఎంఐఎస్ డిజిటల్ వ్యవస్థపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ట్రెజరీ అధికారి గాయత్రి సూచించారు.
రాష్ట్ర ఆర్థికశాఖ ఆదేశాల మేరకు ఈ-సాంక్షన్,ఈ హెచ్ఐఆర్ఎంఎస్,వర్క్స్ అకౌంట్స్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విధానాల అమలుపై జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులకు మరియు జిల్లా అధికారులకు గురువారం వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐఎఫ్ఎంఐఎస్ ద్వారా ప్రభుత్వ శాఖల ఆర్థిక లావాదేవీలు,బిల్లుల చెల్లింపులు,ఉద్యోగుల సేవా వ్యవహారాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడమే లక్ష్యమని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన డిజిటల్ విధానాలను అధికారులు పూర్తిస్థాయిలో అర్థం చేసుకుని, నిబంధనల మేరకు సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు.




