Wanaparthy: అమరచింతలో అగ్నిప్రమాదం - కుమ్మరి వాము దగ్ధం!

Wanaparthy: వనపర్తి జిల్లా అమరచింతలో పెను ప్రమాదం చోటుచేసుకుంది.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 28 April 2026 8:51 PM IST
Wanaparthy
X

Wanaparthy: అమరచింతలో అగ్నిప్రమాదం - కుమ్మరి వాము దగ్ధం!

Wanaparthy: అమరచింతలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కుమ్మరి వాము… అంటే మట్టి పాత్రల గుంపులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో తీవ్ర కలకలం రేగింది. అగ్ని వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో కష్టపడి తయారు చేసిన మట్టి పాత్రలు పూర్తిగా దగ్ధమయ్యాయి. కుండలు తయారు చేసే పనిముట్లు కూడా పూర్తిగా కాలిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇక నష్టపోయిన బాధితులు తమ తాతల కాలం నుండి ఇక్కడే మట్టి కుండలు తయారు చేసుకుంటూ తరతరాలుగా తమ కుటుంబాలు జీవనం సాగిస్తున్నామని తెలిపారు.ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆవేదన తో అర్థించారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

Next Story