Devarakadra: దేవరకద్రలో డోకూర్ పవన్ కుమార్ రెడ్డి వినూత్న కార్యక్రమం

Devarakadra: తెలంగాణలోనే తొలిసారిగా మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ‘సంస్కార శాల’ పేరిట చిన్నారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 20 May 2026 2:17 PM IST
Devarakadra
X

Devarakadra: దేవరకద్రలో డోకూర్ పవన్ కుమార్ రెడ్డి వినూత్న కార్యక్రమం

దేవరకద్ర: తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా దేవరకద్రలో నిర్వహిస్తున్న “సంస్కార శాల” ప్రత్యేక శిక్షణ తరగతులు విశేష ఆదరణ పొందుతున్నాయి. చిన్నారుల్లో భారతీయ సంస్కృతి, నైతిక విలువలు, ఆధ్యాత్మికత మరియు క్రమశిక్షణ పెంపొందించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

శ్రీవత్స వైదిక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, మహబూబ్ నగర్ పార్లమెంట్ కన్వీనర్ డోకూర్ పవన్ కుమార్ రెడ్డి సహకారంతో దేవరకద్రలోని తపోవన్ పాఠశాలలో ఆరు రోజులపాటు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ఈ తరహా కార్యక్రమాన్ని దేవరకద్రలో చేపట్టడంలో పవన్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారని పలువురు అభినందిస్తున్నారు.

09నుండి 17 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు యోగా, ప్రాణాయామం, శారీరక వ్యాయామాలు, ధ్యానం, మనోవికాసం, భారతీయ సంస్కృతి మరియు నైతిక విలువలపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటుండగా, తల్లిదండ్రుల నుంచి కూడా విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి 70 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాశి, అయోధ్య వంటి ఆధ్యాత్మిక క్షేత్రాల నుంచి వచ్చిన విద్వాంసులు మాట్లాడుతూ.. నేటి సమాజంలో పిల్లలకు కేవలం విద్య మాత్రమే కాకుండా సంస్కారం కూడా అత్యంత అవసరమని పేర్కొన్నారు. సంస్కార శాల ద్వారా చిన్నారుల్లో మంచి అలవాట్లు, క్రమశిక్షణ, దేశభక్తి, ఆధ్యాత్మిక భావనలు పెంపొందుతాయని తెలిపారు.

భవిష్యత్ తరాలకు భారతీయ సంస్కృతి పరిరక్షణ ఎంతో అవసరమనే ఉద్దేశంతో డోకుర్ పవన్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా సహకరిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. దేవరకద్రలో ప్రారంభమైన ఈ సంస్కార శాల రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తుందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘా చాలక్ వసంతం వెంకటేష్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి, యజ్ఞ భూపాల్ రెడ్డి, కృష్ణంరాజు, దేవన్న సాగర్, నారాయణరెడ్డి, , అనిల్, శ్రీశైలం చారి, రాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

Next Story