Nagarkurnool: మృతుని కుటుంబానికి గోలి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సాయం

Nagarkurnool: వెల్దండ మండలం రాచూరుకు చెందిన వెంకటయ్య కుటుంబానికి రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఆర్థిక సాయం అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 1 Oct 2026 8:26 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: మృతుని కుటుంబానికి గోలి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సాయం

నాగర్ కర్నూల్ జిల్లా: వెల్దండ మండలం పరిధిలోని రాచూరు గ్రామానికి చెందిన శెట్టిపల్లి వెంకటయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు మృతుడు వెంకటయ్య కుటుం బాన్ని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలి పారు.

గోలి శ్రీనివాస్ రెడ్డీ సమకూ ర్చిన 5 వేల రూపా యలు,మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్ 2 వేల రూపాయలు, మాజీ ఎంపిటిసి గుత్తి వెంకటయ్య 2 వేల రూపాయలు బీఆర్ఎస్ నాయకులు తాజుద్దీన్ 1 వేల రూపాయలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ నాయకులు రాధ కిషన్ గుత్తి జంగయ్య గోకమల్ల రాజు వార్డు సభ్యులు రమేష్ ముదిరాజ్ రామార్జున్ గ్రామస్థులు వెంకటేష్ కృష్ణయ్య యాద య్య తది తరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY