Kollapur: కొల్లాపూర్ పట్టణంలోని పలు కుటుంబాలను పరామర్శించిన బీరం హర్షవర్ధన్!
Kollapur: కొల్లాపూర్ పట్టణంలో ప్రమాదాల బారిన పడి విశ్రాంతి తీసుకుంటున్న పలు కుటుంబాలను శుక్రవారం మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పరామర్శించారు.
Kollapur: కొల్లాపూర్ పట్టణంలోని పలు కుటుంబాలను పరామర్శించిన బీరం హర్షవర్ధన్!
కొల్లాపూర్: కొల్లాపూర్ మున్సిపాలిటీ 18 వ వార్డుకు చెందిన బిచ్చన్న గత కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు కిందపడి ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు.
8వ వార్డుకు చెందిన సుల్తాన్ భాష గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటిదగ్గర ఉన్న వ్యక్తిని, మున్సిపాలిటీ 8వ వార్డు ఇంచార్జ్ కలీం తండ్రి గఫర్ గత కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు గాయపడి ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా వారితో పాటు ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




