Wanaparthy: వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి రాఖీ కట్టిన అక్కి సుశీల!

Wanaparthy: రాఖీ పౌర్ణమి సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి మాజీ సర్పంచ్ అక్కి సుశీల రాఖీ కట్టారు. ప్రజలందరికీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.

G. BALAVARDHAN, PEBBERU
Published on: 28 Aug 2026 12:49 PM IST
Wanaparthy
X

Wanaparthy: వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి రాఖీ కట్టిన అక్కి సుశీల!

Wanaparthy: రాఖీ పౌర్ణమి సందర్భంగా పెబ్బేరు మాజీ సర్పంచ్ అక్కి సుశీల వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

రాఖీ పౌర్ణమి అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాఖీ అనేది కేవలం ఒక దారం కాదు.. అన్నాచెల్లెళ్ల మధ్య జీవితాంతం నిలిచే ప్రేమానుబంధానికి ప్రతీక. సోదరుడు తన సోదరికి అండగా నిలుస్తాననే భరోసాకు, సోదరి తన సోదరుడి క్షేమాన్ని కోరుకునే ఆత్మీయతకు రాఖీ పౌర్ణమి ప్రతీకగా నిలుస్తుంది అని తెలిపారు.

వనపర్తి నియోజకవర్గంలోని ఆడపిల్లలంతా రాఖీ పండుగను అన్నాచెల్లెళ్లతో సంతోషంగా, ఆత్మీయంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఆకాంక్షించారు.

G. BALAVARDHAN, PEBBERU

G. BALAVARDHAN, PEBBERU

Next Story