Kalwakurthi: అభ్యర్థుల లక్ష్య సాధనకు అండగా ‘సుంకిరెడ్డి’.. కల్వకుర్తిలో ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ!
Kalwakurthi: కల్వకుర్తి ఉచిత పోలీస్ శిక్షణ కేంద్రంలో అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.
Kalwakurthi: అభ్యర్థుల లక్ష్య సాధనకు అండగా ‘సుంకిరెడ్డి’.. కల్వకుర్తిలో ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ!
ఈరోజు కల్వకుర్తి ఉచిత SI & కానిస్టేబుల్ శిక్షణా కేంద్రంలో ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ…గ్రామాలలో ఉన్న యువతలో ప్రతిభ,పట్టుదల ఉన్నప్పటికీ,సరైన మార్గదర్శకత్వం,నాణ్యమైన శిక్షణ,అధ్యయన వనరులు అందుబాటులో లేక చాలామంది ఉద్యోగ సాధనలో వెనకబడుతున్నారు,
అలాంటి యువతకు తోడ్పాటును అందిస్తూ ఉద్యోగ సాధన దిశగా వారికి ధైర్యం కల్పించాలనే లక్ష్యంతోనే ఉచిత పోలీస్ శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తున్నామని తెలుపుతూ,పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు కేవలం కోచింగ్ మాత్రమే సరిపోదని,పరీక్షల విధానం, పోటీ స్థాయిని దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన స్టడీ మెటీరియల్ కూడా అత్యంత అవసరమని,యువతను ఉద్యోగ అవకాశాలకు చేరువ చేసేందుకు అవసరమైన ప్రతి సహకారాన్ని మా నుండి అందిస్తూ మా పోలీసు శిక్షణ శిబిరాలకు శిక్షణ కోసం వస్తున్న ప్రతి విద్యార్థికి తమ వంతు తోడ్పాటును అందిస్తున్నామని,చాలా మంది విద్యార్థులు
ఆర్థిక ఇబ్బందుల కారణంగా పుస్తకాలు, మెటీరియల్ కొనలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి పరిస్థితులు ఎవరి లక్ష్యాలకు అడ్డంకి కాకూడదనే భావనతోనే ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని తెలిపారు,
అభ్యర్థులు ప్రతిరోజూ క్రమశిక్షణతో చదువుతూ, సమయాన్ని సద్వినియోగం చేసుకుని లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు,
అభ్యర్థులు మాట్లాడుతూ…
ఉచిత శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ అందించడం తమలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించేందుకు మరింత కష్టపడతామని తెలుపుతూ, మాకు శిక్షణకు సంబంధించిన ప్రతి వనరును సమకూరుస్తూ తోడ్పాటును అందిస్తున్న సుంకిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు,
ఈ కార్యక్రమంలో..
లెక్చరర్స్ బృందంతో పాటు
ఐక్యత ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




