Gadwal: గుండెపోటుతో ఏఎస్ఐ కన్నయ్య అకస్మాత్తుగా మృతి – ఎస్పీ సంతాపం
Gadwal: గద్వాల్ జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ కన్నయ్య తిరుపతి మెట్ల మార్గంలో వెళ్తుండగా గుండెపోటుతో మృతి చెందడం పట్ల ఎస్పీ శ్రీనివాస రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Gadwal: గుండెపోటుతో ఏఎస్ఐ కన్నయ్య అకస్మాత్తుగా మృతి – ఎస్పీ సంతాపం
గద్వాల: గద్వాల జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఏ.ఎస్సై కన్నయ్య అకస్మాత్తుగా మృతి చెందడం పట్ల జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపం తెలిపారు.
శాంతినగర్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రస్తుతం జిల్లా స్పెషల్ బ్రాంచ్‌లో ఫీల్డ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఏ.ఎస్సై కన్నయ్య గురువారం రాత్రి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లి, మొక్కు తీర్చుకునే క్రమంలో మెట్ల మార్గం గుండా కాలినడకన కొండపైకి వెళ్తుండగా, ప్రయాణం చివరి దశలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందారు.
1989 బ్యాచ్‌లో పోలీస్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన కన్నయ్య తన సుదీర్ఘమైన 37 సంవత్సరాల 8 నెలల పోలీసు సేవలో హెడ్ కానిస్టేబుల్‌గా, అనంతరం ఏ.ఎస్సైగా పదోన్నతులు పొందుతూ వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాల్లో విశేష సేవలు అందించారు. తన విధుల్లో నిబద్ధత, సౌమ్యత, బాధ్యతాయుతమైన పనితీరుతో ఉన్నతాధికారులు, తోటి పోలీసు సిబ్బంది, ప్రజల మన్ననలు పొందారు.
ప్రస్తుతం జిల్లా స్పెషల్ బ్రాంచ్‌లో ఫీల్డ్ ఆఫీసర్‌గా ఎంతో బాధ్యతతో విధులు నిర్వర్తిస్తూ ప్రజాసేవలో కొనసాగుతున్న కన్నయ్య ఆకస్మిక మృతి అత్యంత బాధాకరమని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. “సుదీర్ఘకాలం పోలీసు శాఖకు అంకితభావంతో సేవలందించిన మంచి అధికారి, మంచి మనిషిని కోల్పోవడం జిల్లా పోలీసు వ్యవస్థకు తీరని లోటు” అని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు.




