Gadwal: కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌కు రాఖీలు కట్టిన బాల సదనం పిల్లలు
Gadwal: రాఖీ పౌర్ణమి సందర్భంగా గద్వాల్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌కు బాల సదనం పిల్లలు రాఖీలు కట్టి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Gadwal: కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌కు రాఖీలు కట్టిన బాల సదనం పిల్లలు
గద్వాల్: శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ నందు బాల సదనం పిల్లలు జిల్లా కలెక్టర్ కు రాఖిలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,చిన్నారులు చూపించిన ప్రేమ మరియు ఆప్యాయత నాకు ఎంతో ఆనందం కలిగించింది.
వారితో కలిసి ఈ పండుగను జరుపుకోవడం నాకు సంతోషంగా ఉందని అన్నారు. అలాగే, బాల సదనం పిల్లల చదువు, ఆరోగ్యం కొరకు ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుంది, బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అందుకోవాలని అన్నారు.ఈ సందర్భంగా పిల్లలకు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిసిపిఓ నర్సింహులు,సూపరిడెంట్ వెంటేశ్వరి,పి.ఓ.ఐ.సి ఇంచార్జ్ సురేష్,చిన్నారులు,తదితరులు పాల్గొన్నారు..
Next Story




