Gadwal: గోనుపాడులో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే తనయుడు

Gadwal: గద్వాల మండలం గోనుపాడులో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే తనయుడు సాయి సాకేత్.

GOKARANNA,  GADWAL
Published on: 4 Nov 2026 6:44 PM IST
Gadwal
X

Gadwal: గోనుపాడులో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే తనయుడు

గద్వాల: ఈరోజు గద్వాల నియోజకవర్గం గద్వాల మండలం పరిధిలో గోనుపాడు గ్రామం డబల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు వలి నూతన గృహప్రవేశానికి కార్యక్రమం ముఖ్య అతిథిగా గద్వాల ఎమ్మెల్యే తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి హాజరయ్యారు.ఎమ్మెల్యే తనయుడు చేతుల మీదుగా నూతన గృహాన్ని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది.

ఎమ్మెల్యే తనయుడు మాట్లాడుతూ ....

ముందుగా నూతన గృహప్రవేశాన్ని చేసిన లబ్ధిదారులకు హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. గోనుపాడు గ్రామంలో డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి అని భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.

GOKARANNA,  GADWAL

GOKARANNA, GADWAL