Gadwal: గ్రామాల రీసర్వేపై ప్రత్యేక దృష్టి సారించాలి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

Gadwal: జోగులాంబ గద్వాల జిల్లాలో గ్రామాల రీసర్వే, 22ఏ భూముల గుర్తింపుపై రెవెన్యూ అధికారులతో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమీక్ష నిర్వహించారు.

GOKARANNA,  GADWAL
Published on: 27 Aug 2026 11:09 PM IST
Gadwal
X

Gadwal: గ్రామాల రీసర్వేపై ప్రత్యేక దృష్టి సారించాలి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

గద్వాల్: జిల్లాలో గ్రామాల రీసర్వే పై ప్రత్యేక దృష్టి సారించాలని, వ్యవసాయ, వ్యవసాయేతర భూములు 22ఏ కింద నమోదు అయిన భూ వివరాలను గుర్తించి నిర్ణీత ప్రొఫార్మాలో పొందుపరచి వివరాలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

భూభారతి, 22ఏ, సమగ్ర రీసర్వే, తదితర అంశాలపై గురువారం రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ హైదరాబాదు నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. భూభారతి డాటా ఆధారంగా ఎక్కడైనా 22ఏ ఎక్స్ టెంట్ లో తేడాలు వస్తే వాటిని భూభారతి పోర్టల్ లోనే పరిష్కరించాలని సూచించారు.

వ్యవసాయ, వ్యవసాయేతర భూముల్లో 22ఏ కింద నమోదు అయినట్లు ఉంటే వాటిని గుర్తించి నిర్ణీత ప్రొఫార్మాలో తహసిల్దార్ ల నుంచి సేకరించి నివేదిక సమర్పించాలని సూచించారు. ఇందుకోసం స్టాండర్డ్ ఆపరేషన్ సిస్టం అమలు చేయాలని తెలియజేశారు. అదేవిధంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో సమగ్రంగా భూ రీసర్వే నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని వాటి సత్ఫలితాలు ఆధారంగా అన్ని గ్రామాల్లో రీసర్వే చేయాల్సి ఉంటుందని తెలియజేశారు.

గద్వాలలోని కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ విసి అనంతరం వెబ్ఎక్స్ ద్వారా జిల్లాలోని రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆయా మండలాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు 22ఏ లో నమోదు అయిన వాటిని గుర్తించి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. సాదా బైనామాల్లో పరిష్కరించాల్సిన, తిరస్కరించిన దరఖాస్తులపై స్పష్టతతో ముందుకెళ్లలన్నారు.

భూభారతి ఆర్జీలను కూడా త్వరితగతిన పరిష్కరించాలని పేర్కొన్నారు. జిల్లాలో రిజిస్ట్రేషన్లపై నిషేధం ఉన్న వివిధ కేటగిరీల్లోని వ్యవసాయేతర భూముల వివరాలను సమగ్రంగా పునఃపరిశీలించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గతంలో సమర్పించిన డిసెంబర్‌ 2025 నాటి వివరాలను ప్రాతిపదికగా తీసుకుని, ప్రస్తుతం భూముల పరిస్థితిని పరిశీలించాలని సూచించారు. పాత, ప్రస్తుత వివరాల్లో మార్పులు ఉంటే వాటిని గుర్తించి కారణాలతో సహా నమోదు చేయాలని పేర్కొన్నారు.

భూ భారతి పోర్టల్‌లోని సర్వే నంబర్‌, సబ్‌ డివిజన్‌ వివరాలను పరిశీలించి తాజా పరిస్థితులను నమోదు చేయాలని చెప్పారు. ఎకరాలు, చదరపు గజాల వివరాలను కలిపే సమయంలో జరిగిన తప్పులను సరిచేయాలన్నారు. తహసీల్దార్లు గ్రామాల వారీగా సవరించిన జాబితాలను సిద్ధం చేసి జిల్లా స్థాయిలో సమీకరించాలన్నారు. అవసరమైన సవరణలు పూర్తయ్యాక సంబంధిత అధికారులు సంతకాలు చేసిన తుది ప్రతులను ఆన్‌లైన్‌లో మళ్లీ అప్‌లోడ్‌ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు..

GOKARANNA,  GADWAL

GOKARANNA, GADWAL

Next Story