Gadwal: గద్వాల ఐడీఓసీలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
Gadwal: జోగులాంబ గద్వాల ఐడీఓసీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. సంక్షేమ పథకాల అమలుపై వెల్లడి.
Gadwal: గద్వాల ఐడీఓసీలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
గద్వాల: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శనివారం ఐడిఓసి ఆవరణ వద్ద జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ముందుగా కలెక్టర్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి గాంధీజీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న వారందరికీ, ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి ఏమైనా సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకుంటూ జిల్లా సమగ్ర అభివృద్ధికి ముందుకెళ్లాలన్నారు.
గాంధీజీ, నెహ్రూజీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, తదితర ఎంతో మంది మహనీయుల త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న స్వాతంత్ర్య, ప్రజాస్వామిక దేశంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.
జోగులాంబ గద్వాలను వెనుకబడ్డ జిల్లా అనే పేరును రూపూ మాపేందుకు పేదల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి జిల్లా అనేక రంగాల్లో రాష్ట్రంలోనే ముందంజలో ఉండేలా పనిచేస్తామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.




