Gadwal: రూ.2.5 లక్షల LOC లెటర్‌ను అందజేసిన ఎమ్మెల్యే బండ్ల
Gadwal: గద్వాల పట్టణం 28వ వార్డుకు చెందిన జాకీయ బేగం వైద్య చికిత్స కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.2.50 లక్షల ఎల్ఓసీ లెటర్‌ను అందజేసిన ఎమ్మెల్యే బండ్ల.
Gadwal: రూ.2.5 లక్షల LOC లెటర్‌ను అందజేసిన ఎమ్మెల్యే బండ్ల
గద్వాల: ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గద్వాల టౌన్ 28వ వార్డ్ షేరెల్లి వీధీ చెందిన జాకీయ బేగం w/o మొహమ్మద్ జలీల్ కు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన 2లక్షల 50వేలు రూపాయలు LOC లెటర్ ను గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చంద్రశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, నాయకులు AVL నర్సింగ్ రావు, రామకృష్ణ, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




