Gadwal: సాగునీటిపై నీటిపారుదల శాఖ అధికారులతో ఎమ్మెల్యే బండ్ల సమీక్ష

Gadwal: గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సాగునీటి సరఫరాపై అధికారులతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమీక్ష. రైతులు ఆరుతడి పంటలు వేసేలా చూడాలని సూచన.

GOKARANNA,  GADWAL
Published on: 21 Aug 2026 9:09 PM IST
Gadwal
X

Gadwal: సాగునీటిపై నీటిపారుదల శాఖ అధికారులతో ఎమ్మెల్యే బండ్ల సమీక్ష

గద్వాల: నేడు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశంను ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి నిర్వహించారు.రైతులు నీటిని సరైన క్రమంలో వాడుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

రైతులతో సమాన్వయం చేసుకోని వర్షాబావ స్థితిని, ఎల్నినో ప్రభావాన్నీ రైతులకు వివరించి సాగునీటి వినియోగం తెలపాలని ఆరు తడి పంటలను వేసుకొనేలా చూడాలని తెలిపారు.

ప్రతి రిజర్వాయర్ ను చెరువును, కాలువలకు కుంటలకు వీలైనంత త్వరగా నీటితో నింపాలని కర్ణాటక ఆల్మట్టి నారాయణపురం నుండి వచ్చిన నీటిని వృధా చేయకుండా వినియోగించుకోవాలి రెండు పంటలకు ఉపయోగించుకోవాలని దశలవారీగా నీటిని వినియోగించుకోవాలని సూచించారు.

GOKARANNA,  GADWAL

GOKARANNA, GADWAL

Next Story