Gadwal: పేద ప్రజల సొంతింటి కల ఇందిరమ్మ ఇళ్లతో సాకారం కృష్ణమోహన్ రెడ్డి
Gadwal: గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండలం మేకలసోంపల్లి, సద్దలోనిపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.
Gadwal: పేద ప్రజల సొంతింటి కల ఇందిరమ్మ ఇళ్లతో సాకారం కృష్ణమోహన్ రెడ్డి
Gadwal: గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండలం పరిధిలో మేకలసోంపల్లి, సద్దలోని పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్లు చేపట్టిన పథకం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి కావడం లబ్ధిదారులు నూతన గృహప్రవేశం చేయడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరు పేదలైన ప్రజలకు ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయించి వారికి విడతల వారీగా వారి ఖాతాలు డబ్బులను ఐదు లక్షల రూపాయలను నమోదు చేయడం జరిగింది. వాటికి తోడుగా లబ్ధిదారులు మరికొంత డబ్బులను తో ఇంటిని అన్ని వసతులతో ఏర్పాటు చేసుకోవడం జరిగినది. గద్వాల నియోజకవర్గంలో మొదటి విడత లో 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం జరిగినది. దాదాపుగా 2000 పైగా ఇండ్లు నిర్మాణం పనులు కొనసాగుతున్న. త్వరగా ఇంటి నిర్మాణం పనులు పూర్తి చేసుకొని గృహ ప్రవేశాలు చేయాలి. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదింటి ప్రజల సొంతింటి కల ప్రజాపాలన సీఎం రేవంత్ రెడ్డితో సాధ్యమైనది అని పేర్కొన్నారు.




