Gadwal: 10వ వార్డులో మురుగు కష్టాలు.. శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి!

Gadwal: గద్వాల ధరూర్‌మెట్టు వీధి డ్రైనేజీలో పేరుకుపోయిన మురుగు, పూడిక. డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్‌, అధికారులకు ప్రజల విజ్ఞప్తి.

GOKARANNA,  GADWAL
Published on: 24 Aug 2026 2:33 PM IST
Gadwal
X

Gadwal: 10వ వార్డులో మురుగు కష్టాలు.. శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి!

Gadwal: గద్వాల పట్టణంలోని ధరూర్‌మెట్టు వీధి, 10వ వార్డులో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు జిల్లా కలెక్టర్‌, మున్సిపల్‌ అధికారులను కోరుతున్నారు. రోడ్డు సమీపంలోని డ్రైనేజీ కాలువలో మురుగునీరు నిలిచిపోవడంతో దుర్గంధం వెదజల్లుతుండగా, దోమల బెడద తీవ్రంగా పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమస్యపై గతంలో పలుమార్లు స్థానికులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పూర్తిస్థాయి పరిష్కారం లభించలేదని వారు వాపోతున్నారు. గత మున్సిపల్‌ ఎన్నికలకు ముందు డ్రైనేజీ కాలువ నిర్మాణానికి గద్వాల ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించడంతో సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రజలు ఆశించారు.

అయితే కాలువపై రెండు చోట్ల స్లాబ్‌లు ఏర్పాటు చేయడంతోనే పనులు పూర్తయినట్లు కనిపిస్తోందని, అసలు సమస్య అయిన కాలువలో పేరుకుపోయిన మురుగునీరు, పూడిక తొలగింపు మాత్రం జరగలేదని స్థానికులు అంటున్నారు.

కాలువలో గతంలో పేరుకుపోయిన మురుగునీరు, పూడిక కారణంగా ప్రస్తుతం పైభాగంలో మాత్రమే నీరు ప్రవహిస్తూ, అడుగుభాగంలో మురుగు పేరుకుపోతుందని ప్రజలు చెబుతున్నారు. దీంతో పరిసర ప్రాంతాల్లో దుర్గంధం వ్యాపించడంతో పాటు దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

GOKARANNA,  GADWAL

GOKARANNA, GADWAL

Next Story