Talakondapally: గణనాథుడి సేవలో పాల్గొన్న సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్!

Talakondapally: తలకొండపల్లి మండలం సంగాయిపల్లిలో విఘ్నేశ్వరుని పూజా మహోత్సవం ఘనంగా జరిగింది. సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 17 Sept 2026 1:23 PM IST
Talakondapally
X

Talakondapally: గణనాథుడి సేవలో పాల్గొన్న సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్!

తలకొండపల్లి: తలకొండపల్లి మండల, రాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని సంగాయిపల్లి గ్రామంలో వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుని పూజా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్ * పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని విఘ్నేశ్వరుని ప్రార్థించినట్లు తెలిపారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో గ్రామంలో శాంతి, ఐక్యత, అభివృద్ధి వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ పూజా మహోత్సవంలో గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY