Kothakota: కొత్తకోట అయ్యప్ప క్షేత్రంలో నవంబర్ 4న సర్వసభ్య సమావేశం!
Kothakota: వనపర్తి జిల్లా కొత్తకోట శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప క్షేత్రంలో నవంబర్ 4న సర్వసభ్య సమావేశం. కార్తీక మాసం అన్నదాన కార్యక్రమం, ఆలయ నిర్మాణ పనులపై చర్చించనున్న శ్రీ అయ్యప్ప సేవా సమితి.
Kothakota: కొత్తకోట అయ్యప్ప క్షేత్రంలో నవంబర్ 4న సర్వసభ్య సమావేశం!
Kothakota: వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలోని శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప క్షేత్రంలో ఈ నెల 4వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు శ్రీ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు సమితి సభ్యులు తెలిపారు.
ఈ సమావేశంలో ప్రధానంగా ఈ ఏడాది కార్తీక మాసం సందర్భంగా నిర్వహించనున్న అన్నదాన కార్యక్రమం ప్రారంభోత్సవం, కార్యాచరణ, నిధుల సమీకరణ తదితర అంశాలపై చర్చించనున్నారు. అదేవిధంగా ఆలయ నిర్మాణ పనుల ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణ, నిధుల సమీకరణ, ఇప్పటివరకు జరిగిన ఖర్చుల వివరాలపై చర్చించనున్నారు.
ఈ సమావేశానికి సమస్త అయ్యప్ప భక్తులు, ఆలయ స్థల దాతలు, అన్నదాతలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తమ విలువైన సలహాలు, సూచనలు అందించి సమావేశాన్ని విజయవంతం చేయాలని శ్రీ అయ్యప్ప సేవా సమితి – కొత్తకోట, మదనాపురం సభ్యులు కోరారు.




