Wanaparthy: రంగాపురం గ్రామ శివారులో భారీ కొండచిలువ కలకలం!
Wanaparthy: వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం గ్రామ శివారులో జములమ్మ గుంపు కాలువ వద్ద భారీ కొండచిలువ ప్రత్యక్షం కావడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు.
Wanaparthy: రంగాపురం గ్రామ శివారులో భారీ కొండచిలువ కలకలం!
వనపర్తి జిల్లా: పెబ్బేరు మండలం రంగాపురం గ్రామ శివారులో భారీ కొండచిలువ ప్రత్యక్షం కావడంతో స్థానికులు, రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంగళవారం రాత్రి రైతులు తమ పంట పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్తుండగా, గ్రామ శివారులోని పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న జములమ్మ గుంపు కాలువలో నుంచి భారీ కొండచిలువ బయటకు వచ్చింది. ఒక్కసారిగా కొండచిలువను చూసిన రైతులు భయంతో అప్రమత్తమయ్యారు.
వెంటనే స్థానికులకు సమాచారం అందించడంతో పాటు సంబంధిత శాఖ అధికారులకు కూడా తెలియజేశారు. గ్రామ శివారులో భారీ కొండచిలువ సంచరిస్తుండటంతో రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కొండచిలువను సురక్షితంగా పట్టుకుని జనావాసాలకు దూరంగా తరలించాలని స్థానికులు కోరుతున్నారు.




