Nagarkurnool: రూ.7 వేల ఆర్థిక సాయం అందించిన గోలి శ్రీనివాస్ రెడ్డి!

Nagarkurnool: నెమలిగుట్ట తండాకు చెందిన కొర్రావత్ నీరు కుటుంబానికి అంత్యక్రియల నిమిత్తం రూ.7 వేల ఆర్థిక సహాయం అందించిన తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 1 Aug 2026 11:47 AM IST
Nagarkurnool
X

Nagarkurnool: రూ.7 వేల ఆర్థిక సాయం అందించిన గోలి శ్రీనివాస్ రెడ్డి!

Nagarkurnool: నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం:-జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తండాకు చెందిన కొర్రావత్ నీరు అనారోగ్యంతో మృతి చెందారు.ఈ విషాదకర ఘటన గురించి వార్డ్ సభ్యులు డీజే గోపాల్ ద్వారా తెలుసుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

మృతుడి కుటుంబానికి అండగా నిలుస్తూ,అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.7 వేల ఆర్థిక సహాయాన్ని డీజే గోపాల్ ద్వారా కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ,కొర్రావత్ నీరు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ,ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

అనంతరం మాజీ ఎంపీటీసీ నృపాల్,వార్డ్ మెంబర్ డీజే గోపాల్,పవన్, జేపల్లి రవి కిష్టన్,మున్నా,మణిరామ్ తదితరులు పార్థివ దేహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story