Kalwakurthy: అస్వస్థతతో ఉన్న వ్యక్తికి గోలి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సాయం

Kalwakurthy: కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జానీని ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 1 Nov 2026 3:18 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: అస్వస్థతతో ఉన్న వ్యక్తికి గోలి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సాయం

నాగర్ కర్నూల్ జిల్లా: కల్వకుర్తి మున్సిపాలిటీ జేపీ నగర్ తండా గ్రామానికి చెందిన జానీ అనారోగ్యంతో బాధపడుతూ కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి , కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం కలిసి ఆసుపత్రికి వెళ్లి జానీ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని ఆకాంక్షిస్తూ రూ.5,000 ఆర్థిక సాయం అందించారు.

కార్యక్రమంలో వెల్దండ మండల బీ ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పుట్ట రాంరెడ్డి వార్డు సభ్యులు సునీత ఆనంద్, నరేష్, కిషోర్,గోపాల్ నాయకులు రామకృష్ణ, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY