Gadwal: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికే ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే బండ్ల

Gadwal: గద్వాల క్యాంపు కార్యాలయంలో 580 మందికి పైగా లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పంపిణీ చేశారు.

GOKARANNA,  GADWAL
Published on: 6 Nov 2026 9:13 PM IST
Gadwal
X

Gadwal: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికే ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే బండ్ల

గద్వాల: నేడు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు గద్వాల నియోజకవర్గానికి సంబంధించిన కళ్యాణి లక్ష్మి/ షాదీమూరక్ చెక్కులను పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు.

గద్వాల నియోజకవర్గంలోని అన్ని మండలాలు వివిధ గ్రామాల & గద్వాల టౌన్ చెందిన 580 మంది పైగా ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి / షాదీమూరక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ చేతులమీదుగా 1 లక్ష 116 రూపాయలు చెక్కులను అందజేయడం జరిగినది.

ఎమ్మెల్యే మాట్లాడుతూ..

గద్వాల నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు.

గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయడం జరుగుతుంది గతంలో గ్రామాలలో గత నాయకులు సరిగ్గా పట్టించుకున్న పాపాన పోలేదు కానీ నేను గెలిచి నప్పటి నుండి ప్రతి గ్రామాలను అభివృద్ధి చేసే విధంగా అహర్నిశలు కృషి చేయడం జరుగుతుంది గద్వాల నియోజకవర్గం వైద్యరంగం అభివృద్ధి చెందాలని అహర్నిశలు కృషి చేయడం జరిగింది.

ఈ ప్రభుత్వాలు వచ్చిన ప్రభుత్వాలతో గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగింది. మెడికల్ కాలేజ్ ,నర్సింగ్ కాలేజ్, 300 పడకల హాస్పిటల్, సి.సి రోడ్లు డ్రైనేజీ, ప్రధాన రహదారులు రోడ్డు నిర్మాణంలో, జూనియర్ కాలేజీ, గురుకుల పాఠశాలలు,అభివృద్ధి కార్యక్రమాలను చేసుకోవడం జరిగింది. కళ్యాణ లక్ష్మి చెక్కుల కొరకు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మధ్యవర్తిని లేకుండా చెక్కులను అందించడం జరుగుతుందని తెలిపారు.

GOKARANNA,  GADWAL

GOKARANNA, GADWAL