Achampet: అచ్చంపేటలో రేపు 108 కలశాలతో శివాంజనేయ స్వామికి అభిషేకం!

Achampet: కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం అచ్చంపేట ఆంజనేయ స్వామి ఆలయంలో 108 కలశాలతో అభిషేకం, ఉట్ల కోనేరు నుండి కలశయాత్ర, మధ్యాహ్నం భిక్ష నిర్వహించనున్నారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 23 Nov 2026 3:14 PM IST
Achampet
X

Achampet: అచ్చంపేటలో రేపు 108 కలశాలతో శివాంజనేయ స్వామికి అభిషేకం!

అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో రేపు 24-11-2026 మంగళవారం రోజు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామికి, శివ స్వామికి అభిషేక కార్యక్రమం జరగనుంది.

108 కలశాలతో మరియు వివిధ రకాల పుష్పములతో ఉట్ల కోనేరు నుండి ఊరేగింపుగా విచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు అభిషేక కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది.

శ్రీ నల్లపు శ్రీనివాసులు గురుస్వామి గారి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో భక్తులు, స్వాములు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నారు.

ఈ కార్యక్రమానికి విచ్చేయు మహిళలు ఇంటి దగ్గర నుంచి కలశాలు తీసుకొని రావాలని నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA