Nagar Kurnool: గుండాల ఉప సర్పంచ్ మృతికి గోలి శ్రీనివాస్ రెడ్డి సంతాపం
Nagar Kurnool: నాగర్ కర్నూలు జిల్లా గుండాల ఉప సర్పంచ్ కొమ్ము లింగం మృతికి ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సంతాపం. రూ.5,000 ఆర్థిక సాయం పంపిణీ.
Nagar Kurnool: గుండాల ఉప సర్పంచ్ మృతికి గోలి శ్రీనివాస్ రెడ్డి సంతాపం
Nagar Kurnool: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం:- గుండాల గ్రామ ఉప సర్పంచ్ కొమ్ము లింగం అనారోగ్యంతో బాధపడుతూ 17-08-2026న మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, లింగం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అంతేకాకుండా వెల్దండ మండల బీఆర్‌ఎస్ పార్టీ నాయకుల ద్వారా మృతుడి కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా లింగం కుటుంబానికి అండగా ఉంటామని నాయకులు భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో వెల్దండ బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు జోగయ్య, మాజీ ఉప సర్పంచ్ నిరంజన్, మాజీ జడ్పీటీసీ జంగయ్య, మాజీ ఎంపీటీసీ జ్యోతి నిరంజన్, మాజీ ఎంపీటీసీ లింగం, 4వ వార్డు సభ్యులు సునీత ఆనంద్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు నాగయ్యతో పాటు నాయకులు దాసు, గుండాల శ్రీను, సత్యం, ప్రవీణ్, వెంకటయ్య, రవి, తిరుపతి, జగన్, రాజు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.




