Narayanpet: ఐడీబీఐ ప్రైవేటీకరణను ఖండించాలి: బండి వేణుగోపాల్
Narayanpet: ప్రతిష్టాత్మక ఐడీబీఐ బ్యాంకును తక్కువ విలువ చూపి ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత బండి వేణుగోపాల్ మండిపడ్డారు.
Narayanpet: ఐడీబీఐ ప్రైవేటీకరణను ఖండించాలి: బండి వేణుగోపాల్
నారాయణపేట: IDBI( ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా,1964 లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్యాంకు) ఈ బ్యాంకు ను ప్రైవేటీకరణ ప్రతిపాదనపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ బండి వేణుగోపాల్ తీవ్రంగా ఆక్షేపించారు.
ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకులు జాతి సంపదని వాటి విలువను ఉద్దేశపూర్వకంగా ఇండియా ప్రభుత్వం వచ్చినప్పటినుండి తక్కువ చేసి చూపి అమ్మ చూపడం తీవ్ర ఏహై మైనా చర్యలుగా అభివర్ణించారు. ఒకవైపు IDBI ఉద్యోగులు లేవనెత్తుతున్న ఆందోళనను పట్టించుకోకుండా రిజర్వు ధర కంటే తక్కువ బిడ్లు వచ్చినప్పుడు నిబంధనలు మదింపు పద్ధతులు ఎందుకు మార్చాల్సి వచ్చిందన్నారు.
ఈ బ్యాంకుకు హైదరాబాదు తో పాటు ఇతర ప్రధాన నగరాల్లో బ్యాంకుకు అత్యంత విలువైన భూములు స్థిరాస్తులు ఉన్నాయని వాటి విలువలను సరిగ్గా లెక్కించకుండా ఐడిబిఐ బ్యాంకు విలువను తక్కువ అంచనా వేస్తున్నారనే నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ రంగ బ్యాంకును ప్రవేట్ పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒకటికి రెండు సార్లు ఆలోచించి దేశ ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పకుండానే.. ఇంత తొందర ఎందుకు వచ్చిందో? ఎందుకు కల్పిస్తున్నారో? అర్థం కాని పరిస్థితులను మేధావి వర్గం ఎండకట్టాలని కోరారు.




