Nagarkurnool: ఎల్నినో పేరుతో కాంగ్రెస్ తప్పించుకుంటోంది: హరీశ్ రావు!
Nagarkurnool: రైతులకు నీళ్లివ్వకుండా ఎల్నినో పేరుతో తప్పించుకుంటున్నారు: కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం. కల్వకుర్తి లిఫ్ట్ మోటార్లను 24 గంటలు నడపాలని డిమాండ్.
Nagarkurnool: ఎల్నినో పేరుతో కాంగ్రెస్ తప్పించుకుంటోంది: హరీశ్ రావు!
Nagarkurnool: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించడంలో విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. ఎల్నినో పేరుతో ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని, ఇది ఎల్నినో తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ పాలనలో ఏర్పడిన కరువు అని విమర్శించారు. తెలంగాణలో పలు ప్రాంతాల్లో క్రాప్ హాలిడే పరిస్థితులు ఏర్పడటానికి నీటి కొరత కంటే ప్రభుత్వ వైఫల్యమే కారణమని అన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో ఐదు మోటార్లు ఉన్నప్పటికీ ఒకటి, రెండు మోటార్లను మాత్రమే నడుపుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు ఒత్తిడి చేస్తే మూడు మోటార్లు నడుపుతున్నారని, అవి కూడా రోజుకు ఎనిమిది గంటలకే పరిమితం చేస్తున్నారని అన్నారు. నాలుగు వేల క్యూసెక్కుల నీటిని ఎత్తే అవకాశం ఉన్నప్పటికీ కేవలం 800 క్యూసెక్కులకే పరిమితం చేస్తున్నారని చెప్పారు. శ్రీశైలంలో నీరు ఉన్నప్పటికీ పాలమూరు రైతులకు సాగునీరు అందించడం లేదని విమర్శించారు.
కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్, తుమ్మిళ్ల వంటి ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని హరీశ్ రావు పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో రూ.30 వేల కోట్లు ఖర్చు చేసి నార్లాపూర్, ఏదుల, కరివెన, వట్టెం రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టామని, సుమారు 50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని సిద్ధం చేశామని అన్నారు. ప్యాకేజీ-3లో మిగిలిన పనులను వెంటనే పూర్తి చేసి నాలుగు రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేశారు.
గోదావరి పరిధిలోని దేవాదుల ప్రాజెక్టులోనూ నీటిని పూర్తిస్థాయిలో ఎత్తడం లేదని హరీశ్ రావు ఆరోపించారు. కృష్ణా, గోదావరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించేందుకు మోటార్లను 24 గంటలు నడపాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల వినియోగంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన ఆయన, అసెంబ్లీలో ఇచ్చిన లెక్కలు, వాస్తవ నీటి వినియోగంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వాటర్ మేనేజ్మెంట్, పవర్ మేనేజ్మెంట్లో విఫలమైందని హరీశ్ రావు విమర్శించారు. మోటార్లను పదేపదే ఆన్, ఆఫ్ చేయడం వల్ల వాటి సామర్థ్యం దెబ్బతినడంతో పాటు కాలిపోయే ప్రమాదం ఉందన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




