Mahabubabad: తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలి: కంచ వెంకన్న డిమాండ్!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఎండిపోయిన పంట పొలాలను ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న పరిశీలించారు.
Mahabubabad: తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలి: కంచ వెంకన్న డిమాండ్!
మహబూబాబాద్: గూడూరు పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గూడూరు మండల కేంద్రంలోని చెన్నం చెరువు, కోడి చెరువు, బొమ్మాయికుంట,,కొత్త కుంట ,తదితర ప్రాంతాలలో బీడుగా ఉన్న వ్యవసాయ భూములు కొద్ది గొప్పగా వేసినటువంటి ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించడం జరిగింది.
అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎం సిపిఐ(యు) పార్టీ మహబూబాద్ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 365 కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ నేటి వరకు రైతులను ఆదుకునే కరువు నివారణ చర్యలుచేపట్టకపోవడం బాధాకరమని అన్నారు మహబూబాబాద్ జిల్లాలోని 18 మండలాలు కరువు జాబితాలో చేర్చి రైతులు తీసుకున్న బ్యాంకు రుణాలు పూర్తిగా మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అట్లాగనే గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ మీద ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ కార్మికులను పేద ప్రజల కు వి బి జి రామ్ జి ఉపాధి హామీ పథకం ద్వారా 200 రోజుల పని దినాలకు పెంచి రోజుకు 600 చొప్పున చెల్లించే విధంగా పనులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు పౌరసరఫరాల చౌక ధరల డిపో నుండి ప్రజలకు బియ్యంతో పాటు నిత్యవసర సరుకులు సబ్సిడీ రూపేనా అందించాలని కోరినారుకరువు మండలాలు ప్రకటించి ప్రణాళిక లేకుండా పనులు చేపట్టడంలో పూర్తి వైఫల్యం చెందారని విమర్శించార. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి నూకల ఉపేందర్, గూడూరు మండల కార్యదర్శి బందెల వీరస్వామి, జిల్లా నాయకులు కటకం బుచ్చిరామయ్య, తదితరులు పాల్గొన్నారు.




