Veldanda: వెల్దండలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి!

Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో గురువారం సర్పంచ్ మట్ట యాదమ్మ, యెన్నం భూపతి రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 19 Nov 2026 2:46 PM IST
Veldanda
X

Veldanda: వెల్దండలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి!

నాగర్ కర్నూల్ జిల్లా: వెల్దండ మండల కేంద్రంలో గురువారం దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ... "దేశ ప్రగతి కోసం, పేదల సంక్షేమం కోసం ఇందిరా గాంధీ అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. ఉక్కు మహిళగా దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటారు. ఆమె ఆశయాలను కొనసాగించడమే మనందరి బాధ్యత" అని అన్నారు.

సింగిల్ విండో చైర్మన్ యెన్నం భూపతి రెడ్డి మాట్లాడుతూ... "బ్యాంకుల జాతీయకరణం, హరిత విప్లవం, గరీబీ హఠావో నినాదంతో కోట్లాది మంది పేదల గుండెల్లో ఇందిరా గాంధీ చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆమె సేవలు యువతకు స్ఫూర్తిదాయకం" అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హరికిషన్ నాయక్, సర్పంచులు సంగీత శేఖర్ రెడ్డి, గన్యా నాయక్, ఉప సర్పంచ్ బస్నమోని శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ కొయ్యల పుల్లయ్య,సీనియర్ క్యాసరపు వెంకటయ్య, కృష్ణ ముదిరాజ్, ఎండి రషీద్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎండి హమీద్, తిరుపతి రెడ్డి, రంగనాథం,భరత్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్,కిష్టల్, వెంకటేష్, శ్రీనివాస్, కొండయ్య, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లయ్య, తిరుపతి, గజిని శ్రీను,ఈదులపల్లి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, కూన వెంకటయ్య, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY