Atmakur: ఆత్మకూరులో 35 మందికి ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు
Atmakur: వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో 35 మంది అర్హులైన పేదలకు మంత్రి వాకిటి శ్రీహరి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అధికారికంగా అందజేశారు.
Atmakur: ఆత్మకూరులో 35 మందికి ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు
ఆత్మకూరు: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆత్మకూరు మండలంలో 35 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు.
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతో భరోసానిస్తుందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు.




