Makthal: మక్తల్లో యజ్ఞంలా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు..వాకిటి లలిత!
Makthal: మక్తల్లో నిర్వహించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకకు మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలిత హాజరయ్యారు.
Makthal: మక్తల్లో యజ్ఞంలా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు..వాకిటి లలిత!
Makthal: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేద కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతోందని మంత్రి వాకిటి శ్రీహరి గారి సతీమణి వాకిటి లలిత అన్నారు. మక్తల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు ఒక యజ్ఞంలా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తాజాగా మక్తల్లో నిర్వహించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకకు ఆమె హాజరై, నూతన గృహంలోకి అడుగుపెట్టిన కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపి వారికి వాకిటి వారి కానుకను అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్నదే మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్ష అని తెలిపారు. నియోజకవర్గంలో ఏ ఒక్క పేదవాడు కూడా పూరి గుడిసెల్లో నివసించకూడదని, ప్రతి నిరుపేద కుటుంబం ఆత్మగౌరవంతో సొంతింటిలో జీవించాలన్నదే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు.
పేద కుటుంబానికి సొంతిల్లు కేవలం నాలుగు గోడలు మాత్రమే కాదని, అది భద్రతకు, ఆత్మగౌరవానికి, భవిష్యత్తుపై భరోసాకు ప్రతీక అని వాకిటి లలిత అన్నారు. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు తమ కల నెరవేరడంతో ఆనందం వ్యక్తం చేయడం తనకు సంతోషంగా ఉందన్నారు.
మక్తల్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాల ద్వారా సాధ్యమైనంత మేలు చేకూర్చేందుకు మంత్రి వాకిటి శ్రీహరి కృషి చేస్తున్నారని వాకిటి లలిత తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం తమ ప్రాధాన్యమని వాకిటి లలిత పేర్కొన్నారు.




