Veldanda: వెల్దండలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభం!
Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు.
Veldanda: వెల్దండలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభం!
నాగర్ కర్నూల్ జిల్లా: వెల్దండ మండలం పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని వెల్దండ మండల కేంద్రంలో శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు బీమా పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... "నిరుపేద కుటుంబాలకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఈ బీమా పథకాన్ని తీసుకొచ్చింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకాన్ని అందిస్తాం. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి" అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బస్నమోని శ్రీనివాస్, కార్యదర్శి గిరి, వార్డు సభ్యులు ముదికొండ కవిత రమేష్ , మంజుల శ్రీనివాస్, వెంకటేష్, దేవేందర్, శేఖర్, బొక్కల శ్రీనివాస్,మట్ట భరత్ గౌడ్, ఈదుల పల్లి ఆనంద్, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




