Kalwakurthy: ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావాలి: సుంకిరెడ్డి!
Kalwakurthy: ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించడమే లక్ష్యమని టాస్క్ (TASK) సీఓఓ, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.
Kalwakurthy: ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావాలి: సుంకిరెడ్డి!
కల్వకుర్తి: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ రోజు తుక్కుగూడ లో ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలో నిర్వహిస్తున్న జాబ్ డ్రైవ్ – ఇంటర్వ్యూ కార్యక్రమానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు & TASK C.O.O సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, నైపుణ్యాలను పెంపొందించుకుని ప్రతి ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ బంగారు భవిష్యత్తు నిర్మించుకోవాలన్నారు.
యువత ప్రభుత్వ ఉద్యోగం గానీ , ప్రైవేట్ ఉద్యోగం గానీ ఏదో ఒక ఉద్యోగం చేస్తూ కుటుంబంలో ఆర్థిక స్థిరత్వాన్ని పొందాలన్నారు. యువతకు ఉపాధి కల్పించడం, వారి భవిష్యత్తును తీర్చిదిద్దడం లక్ష్యంగా ఇలాంటి జాబ్ డ్రైవ్‌లు శిక్షణా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. మాలాంటి ఎంతో మంది యువత ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ మాకు తోడ్పాటునందిస్తున్నందుకు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారికి యువత ఎల్లవేళలా ఋణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.
యువతకు ఉద్యోగం కుటుంబానికి భరోసా సమాజానికి అభివృద్ధి" అనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ ఇంటర్యూ కు ఆమనగల్ మండలం నుండి ఎనిమిది ( 8 )మంది , తలకొండపల్లి మండలం నుండి ముగ్గురు (3), వెల్దండ మండలం నుండి ( 11 ) మంది నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 22 మంది నిరుద్యోగ యువత ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు వీర, శ్రీనివాస్ మరియు ఐక్యత పౌండేషన్ సభ్యులు శ్రీరాములు, చంద్రశేఖర్ ఇంటర్వ్యూ కు హాజరైన నిరుద్యోగ యువత పాల్గొన్నారు.




