Gadwal: గద్వాలలో జనసేన ఇన్‌చార్జి బాసు చిన్న తిమ్మప్ప పర్యటన, పూజలు!

Gadwal: జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లి ఆంజనేయస్వామిని జనసేన జిల్లా ఇన్‌చార్జి బాసు చిన్న తిమ్మప్ప శనివారం దర్శించుకుని పూజలు చేశారు.

GOKARANNA,  GADWAL
Published on: 29 Aug 2026 11:36 AM IST
Gadwal
X

Gadwal: గద్వాలలో జనసేన ఇన్‌చార్జి బాసు చిన్న తిమ్మప్ప పర్యటన, పూజలు!

Gadwal: గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లిలోని ప్రసిద్ధ శ్రీ ఆంజనేయస్వామి ఆలయాన్ని శనివారం గద్వాల జిల్లా జనసేన పార్టీ ఇన్‌చార్జి బాసు చిన్న తిమ్మప్ప ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, జిల్లా అభివృద్ధి సజావుగా సాగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులతో కొద్దిసేపు ముచ్చటించి, ఆలయ విశేషాలను తెలుసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. వీరి వెంట జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

GOKARANNA,  GADWAL

GOKARANNA, GADWAL

Next Story