Dharur: పింఛన్ల వెరిఫికేషన్ పారదర్శకంగా నిర్వహించాలి
Dharur: ధరూర్ మండలంలో పింఛన్ల వెరిఫికేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ బి. నర్సింగ రావు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలని ఆదేశం.
Dharur: పింఛన్ల వెరిఫికేషన్ పారదర్శకంగా నిర్వహించాలి
ధరూర్: జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పింఛన్లు పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించాలని అదనపు కలెక్టర్ బి.నర్సింగ రావు అధికారులను ఆదేశించారు. శనివారం అదనపు కలెక్టర్ ధరూర్ మండల పరిధిలోని నీలహళ్లి, నాగర్ దొడ్డి,నెట్టెంపాడు, ధ్యాగదొడ్డి, మాన్ దొడ్డి,చిన్నిపాడు గ్రామాల్లో పర్యటించి జిల్లా స్థాయి పింఛన్ల వెరిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పింఛన్లకు సంబంధించిన వివరాలు, లబ్ధిదారుల అర్హతలు,క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించారు.ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి లబ్ధిదారుని వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని, పరిశీలనలో గుర్తించిన అంశాలను నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అనంతరం గ్రామాల్లో అమలవుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను నిర్ణీత లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన అదనపు కలెక్టర్ ఎల్నినో ప్రభావం,దాని కారణంగా వాతావరణ పరిస్థితుల్లో చోటుచేసుకునే మార్పులు, వ్యవసాయ రంగంపై పడే ప్రభావాల గురించి వివరించారు.




