Gadwal: రైల్వే స్టేషన్ పరిశీలన - రూ. 107 కోట్లతో స్టేషన్ ఆధునీకరణ
Gadwal: గద్వాల రైల్వే స్టేషన్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించారు.
Gadwal: రైల్వే స్టేషన్ పరిశీలన - రూ. 107 కోట్లతో స్టేషన్ ఆధునీకరణ
గద్వాల: గద్వాల జిల్లా, సోమవారం రోజు గద్వాల రైల్వే స్టేషన్ ను పరిశీలించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ తోపాటు రైల్వే డిఆర్ఎం, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించారు. గద్వాల రైల్వే స్టేషన్ కి వచ్చిన సందర్భంలో కేంద్ర మంత్రికీ ఘన స్వాగతం పలికారు రైల్వే అధికారులు.
ఈ సందర్భంగా కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... గద్వాల రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల కోసం 107 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని ఎయిర్ పోర్ట్ లకు దీటుగా రైల్వే స్టేషన్లను సుందరీకారంగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది అన్నారు.
దేశవ్యాప్తంగా ఏడు బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్ లను మంజూరు చేయగా ఇందులో మూడు బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్లను తెలంగాణకు కేటాయించినట్లు మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గద్వాల జిల్లా కేంద్రంలోని బీరెల్లి చౌరస్తాలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి కి కూడా నిధులు మంజూరు చేశామని త్వరలోనే ప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
గద్వాల రైల్వే స్టేషన్ త్వరలో వందేళ్ళ సెలబ్రేషన్ చేసుకుంటున్న సందర్భంలో ప్రయాణికులతో కలిసి గద్వాల రైల్వే స్టేషన్లో పండుగ వాతావరణం నెలకొల్పే విధంగా ఆ ప్రణాళిక రూపొందిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గద్వాల పర్యటనకు వచ్చిన మంత్రి కిషన్ రెడ్డికి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ గద్వాల నుంచి ప్రతి రోజు 7000 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నట్లు, గద్వాల ప్రాంతం అంటే పట్టుచీరలకు ప్రత్యేకత అని ఈ పట్టు చీరల ప్రత్యేకతలు అనేకమంది ఇతర ప్రాంతాల నుంచి ట్రైన్ల ద్వారా గద్వాల ప్రాంతానికి వస్తారని తెలిపారు.
అందులో భాగంగా ఈ ప్రాంతంలో కొన్ని ట్రైన్లు ఆపడం లేదని అట్టి ట్రైన్లను కూడా గద్వాల ప్రాంతంలో ఆపేటట్లు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేంద్ర మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు. రైల్వే శాఖ మంత్రితో మాట్లాడి గద్వాలలో అన్ని ట్రైన్లు ఆగేవిధంగా చర్యలు చేపడతామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.




