Jogulamba Gadwal: ఆకుపచ్చ రంగులోకి మారిన జూరాల నీరు!
Jogulamba Gadwal: జూరాల ప్రాజెక్టులో నీరు ఆకుపచ్చ రంగులోకి మారడంతో స్థానికుల్లో ఆందోళన. మిషన్ భగీరథ తాగునీటి సరఫరాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రజలు.
Jogulamba Gadwal: ఆకుపచ్చ రంగులోకి మారిన జూరాల నీరు!
Jogulamba Gadwal: జోగులాంబ గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టులో నీటి రంగు మారడం కలకలం రేపుతోంది. ప్రాజెక్టులోని నీరు ఆకుపచ్చ రంగులోకి మారడంతో నీరు కలుషితమైందా అనే అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. జూరాల ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ ద్వారా పలు గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుండటంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది.
రంగు మారిన నీటిని తాగాల్సి వస్తుందేమోనని ప్రజలు భయపడుతున్నారు. నీటి రంగు మారడానికి గల అసలు కారణాలను అధికారులు వెంటనే గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు.
నీటి నమూనాలను సేకరించి పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించి, నీరు సురక్షితమేనా కాదా అనే విషయంపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు.




