Kalwakurthy: నిరుద్యోగ హామీలపై బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన
Kalwakurthy: ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ కల్వకుర్తిలో బీఆర్ఎస్వీ నాయకులు ఖాళీ కుర్చీతో చాయ్ తాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు.
Kalwakurthy: నిరుద్యోగ హామీలపై బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన
కల్వకుర్తి: ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగాల హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నాయకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్వీ కల్వకుర్తి నియోజకవర్గ నాయకుడు మీసాల వర్షిత్ (చిక్కి) ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు.
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అశోక్‌నగర్‌లో నిరుద్యోగులతో కలిసి చాయ్ తాగిన రాహుల్ గాంధీ, ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని నాయకులు గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీ జరగలేదని వారు ఆరోపించారు.
రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అశోక్‌నగర్‌కు వచ్చి నిరుద్యోగులతో కలిసి చాయ్ తాగాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిరసనకు ప్రతీకగా అక్కడ ఒక ఖాళీ కుర్చీని ఏర్పాటు చేసి, విద్యార్థి నాయకులు చాయ్ తాగుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు లక్మల్లా శివ, రాజేష్ నాయక్, నరేష్, జునైద్, సాయి తదితరులు పాల్గొన్నారు.




