Kalwakurthy: కల్వకుర్తిలో ఉత్సాహంగా జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్

Kalwakurthy: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో స్టేట్ సౌత్ జోన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ కోసం నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 17 Aug 2026 9:02 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: కల్వకుర్తిలో ఉత్సాహంగా జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్

కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం సెప్టెంబర్ 26, 27 తేదీల్లో హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరగనున్న 12వ తెలంగాణ స్టేట్ సౌత్ జోన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ కోసం నాగర్ కర్నూల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కల్వకుర్తి జయప్రకాశ్ నగర్‌లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మైదానంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్ నిర్వహించారు.

జిల్లా నలుమూలల నుంచి 250 మందికి పైగా క్రీడాకారులు ఈ ఎంపిక పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ విషయాన్ని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సోలపోగుల స్వాములు తెలిపారు. జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్‌ను కల్వకుర్తి డీఎస్పీ వెంకట్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు, క్రీడాకారులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.

ప్రతిరోజూ 24 గంటల్లో కనీసం ఒక గంట సమయాన్ని వ్యాయామం, క్రీడలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించి నాగర్ కర్నూల్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

జిల్లా స్థాయి సెలక్షన్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు భిక్షపతి, పీడీలు ప్రసాద్, బాలయ్య, చంద్రశేఖర్, మల్లేష్, బాలుసు, మల్లేష్, లక్ష్మి, జ్యోతి, లాలమ్మ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story