Kalwakurthy: కల్వకుర్తిలో గణనాథులకు గోలి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు!

Kalwakurthy: కల్వకుర్తిలో వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన గోలి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఏడ్మ సత్యం. ప్రజల సుఖసంతోషాల కోసం ప్రత్యేక ప్రార్థనలు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 23 Sept 2026 7:12 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: కల్వకుర్తిలో గణనాథులకు గోలి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు!

కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను బుధవారం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఏడ్మ సత్యంతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా మండపాల్లో కొలువుదీరిన గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు.

వినాయక మండపాల నిర్వాహకులు, భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న గోలి శ్రీనివాస్ రెడ్డి ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, కల్వకుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని గణనాథుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు ఆయనను సాదరంగా ఆహ్వానించి స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నాగులు నాయక్, కల్వకుర్తి కౌన్సిలర్ రామ్ నాయక్, మాజీ కౌన్సిలర్ తాహిర్ అలీ, మాజీ సర్పంచ్ అంజి నాయక్, వార్డు సభ్యులు ముత్యాల నరేష్, కృష్ణతో పాటు నాయకులు బాలు, మహేష్, శ్రీను, సాయి, మొగులలీ, గణేష్, అనిల్, సాయి కుమార్, మధు, కార్తీక్, రాజు, అంజి, నితిన్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY