Kalwakurthy: మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు ఘన విజయం
Kalwakurthy: కల్వకుర్తిలో మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు విజయవంతం. ప్రజల స్పందనపై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి. సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు.
Kalwakurthy: మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు ఘన విజయం
కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తెలంగాణ ప్రజాప్రభుత్వం దీపావళి పండుగను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' వేడుకలకు ప్రజల నుంచి లభించిన అపూర్వ స్పందన తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, మరింత బాధ్యతతో, రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలనే సంకల్పాన్ని మరింత బలపరచిందని కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు.
లక్షలాది పేద కుటుంబాలు తమ ఇందిరమ్మ ఇళ్లలో ఆనందోత్సాహాలు, చిరునవ్వులు, భావోద్వేగాల మధ్య దీపావళిని జరుపుకోవడం మరిచిపోలేని గొప్ప అనుభూతి అని ఎమ్మెల్యే తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అందించడమే మా ప్రభుత్వ సంకల్పమని ఎమ్మెల్యే అన్నారు. ఇవి కేవలం ఇళ్లు మాత్రమే కాదు, పేదల ఎన్నో ఏళ్ల కలలకు సాకారం, ఆత్మగౌరవానికి ప్రతీకలని ఆయన పేర్కొన్నారు.
ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు, అధికారులతో పాటు ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.




